TTD Calenders : బ్లాక్ మార్కెట్ లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. విచారణకు ఆదేశం

టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్ లో అధిక ధరలకు విక్రయిస్తోంది. మోహన్ పబ్లికేషన్స్ సంస్థ టీటీడీ డైరీలు, క్యాలండర్లను అనధికారికంగా ఆన్ లైన్ లో విక్రయిస్తోంది.

TTD diaries and calendars black market : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతి ఏడాది ప్రచురించే క్యాలెండర్లు, డైరీలకు భారీగా డిమాండ్ ఉంటుంది. తిరుమలతో పాటు హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లోని టీటీడీ దేవాలయాల్లో వీటిని విక్రయిస్తుంటారు. ఎంతో నాణ్యతతో మూర్తీభవించిన స్వామివారి క్యాలెండర్లను తమ ఇంట్లో, కార్యాలయాల్లో ఉంచుకోవడం ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అయితే కొందరు కేటుగాళ్ళు టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్ లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

రాజమండ్రికి చెందిన మోహన్ పబ్లికేషన్స్ సంస్థ టీటీడీ డైరీలు, క్యాలండర్లను అనధికారికంగా ఆన్ లైన్ లో విక్రయాలు చేస్తోంది. దేవుళ్ళు డాట్ కామ్ పేరుతో వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు అధిక ధరలకు విక్రయిస్తోంది. 130 రూపాయలు విలువ చేసే క్యాలెండర్ 198 రూపాయలు కొనుగులు చేస్తోంది. 150 రూపాయలు విలువ చేసే డైరీని 243 రూపాయలకు ఆన్ లైన్ లో విక్రయిస్తోంది.

Tirumala Break Darshan : తిరుమలలో 4వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

అనుమతి లేకుండా మోహన్ పబ్లికేషన్స్ సంస్థ బ్లాక్ మార్కెట్ చేస్తుండడంతో టీటీడీ ప్రెస్ ప్రత్యేక అధికారి రామరాజు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మోహన్ పబ్లికేషన్స్ అమ్మకాలపై అధికారులు టీటీడీ విజిలెన్స్ తో విచారణకు ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు