TTD Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వచ్చేనెల 5న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. డిసెంబరు 30, 31, జనవరి 1 మినహా జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15,000 టికెట్ల చొప్పున టికెట్లు కేటాయింపు ఉంటుంది.
ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, న్యూఇయర్ (తొలి 3 రోజులు- డిసెంబరు 30, 31, జనవరి 1)కు సంబంధించిన ఉచిత టోకెన్ల కోసం నవంబరు 27 నుంచి డిసెంబరు 1 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే సదుపాయం ఉంది. డిసెంబరు 2న ఈడిప్ ద్వారా కేటాయింపులు ఉంటాయి. (TTD Vaikuntha Ekadashi)
మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని ఇటీవలే టీటీడీ తెలిపింది. మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1,000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తామని చెప్పింది.