Vamsi Bail Petition : సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. వంశీకి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని వాదనలు వినిపించారు పీపీ. వంశీ కస్టడీ విచారణ సమయంలో కీలక సమాచారం తెలిసిందన్న పీపీ.. మరో ఇద్దరు నిందితులు సత్యవర్ధన్ ను కలిసినట్లు విచారణలో అంగీకరించినట్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లో వంశీకి బెయిల్ ఇవ్వొద్దని పీపీ కోర్టును కోరారు.
Also Read : పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట..
మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు, వంశీకి ఎలాంటి సంబంధం లేదని వంశీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం కావాలనే వంశీపై తప్పుడు కేసు పెట్టిందని అన్నారు. వంశీకి అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాది కోరారు. వంశీకి బెయిల్ ఇవ్వడం సాక్ష్యులను ఇబ్బంది పెట్టే అవకాశం లేదని వంశీ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ వేశారు. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్ ను విచారిస్తోంది. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోరుతున్నారు. వంశీని మరో 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. మూడు రోజుల కస్టడీలో వంశీ తమకు సహకరించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు పోలీసలు.
Also Read : మొన్న వంశీ.. నిన్న పోసాని.. వైసీపీలో నెక్ట్స్ అరెస్ట్ రజినిదేనా? ఏసీబీ కేసులో బిగుస్తున్న ఉచ్చు..