రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ : వర్మపై వల్లభనేని వంశీ కామెంట్స్

  • Publish Date - November 16, 2019 / 02:20 PM IST

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ న్యూ ఫిల్మ్ రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ చిత్రం గురించి తాను ఇప్పుడే చూస్తున్నట్లు టీడీపీ నుంచి సస్పైండ్ అయిన..వల్లభనేని వంశీ వెల్లడించారు. తన సినిమాలు, మాటలతో ఎప్పుడూ వివాదాల్లో ఉంటారు వర్మ. ప్రస్తుతం..కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. సినిమాతో బిజీగా ఉన్న వర్మ..దీనికి సీక్వెల్ చేసే ఆలోచన వచ్చినట్లు వెల్లడించారు. రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ పేరు పెట్టారు. వల్లభనేని వంశీ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తనకు ఈ ఐడియా తట్టిందని వర్మ వెల్లడించారు. ఈ మేరకు 2019, నవంబర్ 16వ తేదీ సోమవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

Read More : వంశీ కౌంటర్ అటాక్ : రాజీనామా చేస్తా..టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
కొన్ని రోజులుగా వల్లభనేని వంశీ ఎపిసోడ్ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ఆయన ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడుతున్నారు. ఈ సందర్భంగా వల్లభనేని వంశీతో 10tv ప్రత్యేకంగా మాట్లాడింది. వర్మ తీస్తున్న సినిమాలపై వంశీ స్పందించారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఇంకా రిలీజ్ కాలేదు..సినిమా చూడలేదు..ఇలాంటి దానిపై ఇప్పుడు కామెంట్ చేయడం సబబు కాదన్నారు. రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ సినిమా విషయాన్ని వర్మ ప్రకటించారనే విషయాన్ని 10tv గుర్తు చేసింది. ఈ విషయం తనకు తెలియదన్నారు. తమ సహకారం లేకుండానే..ఆయన సినిమా తీసుకోగలుగుతారన్నారు. వర్మతో తనకు పరిచయం మాత్రమే చెప్పిన..రెగ్యులర్‌గా కలవం..కానీ ఎక్కడైనా కనిపిస్తే..మాట్లాడుతారని వల్లభనేని వంశీ వెల్లడించారు.