vallabhaneni vamsi
Vamsi Health Update: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, కొద్దికాలంగా వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కంకిపాడు పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో వంశీ అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను కంపిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ వైద్యులు వంశీకి చికిత్స అందించారు.
వంశీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు చికిత్స నిమిత్తం సోమవారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జీజీహెచ్ లో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్ నార్మల్ గా ఉన్నాయని వైద్యలు తెలిపారు. అయితే, శ్వాస తీసుకోవడానికి వంశీ ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఇదిలాఉంటే.. కొద్దికాలంగా వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.