vangalapudi anitha
కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్‌ను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. రాష్ట్రంలో విపత్తు రిస్క్ తగ్గింపుపై మూడురోజుల పాటు జరిగే శిక్షణను ప్రారంభించారు. రాష్ట్రంలో విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై వివిధ శాఖల అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. సముద్రంలో వేటగాళ్లను అప్రమత్తం చేసే సాంకేతిక పరికరాలను కూడా గత ప్రభుత్వం మూలన పడేసిందని హోంమంత్రి అనిత అన్నారు. రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని చెప్పారు.
విపత్తు నిధుల గురించి డోకా లేదని, ఎన్ఐడీఎమ్ వంటి సంస్థలు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. ప్రమాద అంచనా, ముందస్తు అవగాహన, సంభవించినప్పుడు స్పందనపై అన్ని శాఖల అధికారులు పూర్తి అవగాహన కల్గి ఉండాలని అనిత చెప్పారు.
విజయవాడలో బుడమేరు వరదలను ఎదుర్కొవడంలో ఎన్ఐడీఎమ్, ఎన్డీఆర్ఎఫ్ సంస్థలు సమర్థవంతంగా పనిచేశాయని తెలిపారు. హుద్ హుద్, బుడమేరు ఇతర విపత్తులను సీఎం చంద్రబాబు సారథ్యంలో ఎదుర్కొన్నామని చెప్పారు.
TS Assembly: భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్.. కేటీఆర్ ఏమన్నారంటే?