Vasupalli Ganeshkumar : విశాఖ వైసీపీలో వర్గపోరు..సమన్వయకర్త పదవికి వాసుపల్లి గణేశ్‌కుమార్‌ రాజీనామా

కొద్దికాలంగా విశాఖ దక్షిణం నియోజకవర్గంలోని వైసీపీలో వర్గ పోరు కొనసాగుతోంది. దీంతో విసిగిపోయిన ఆయన నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Visakha Ycp

Vasupalli Ganeshkumar : విశాఖ సౌత్‌ నియోజకవర్గం వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. విశాఖ సౌత్‌ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త పదవికి వాసుపల్లి గణేశ్‌కుమార్‌ రాజీనామా చేశారు. టీడీపీ టికెట్‌పై గెలిచి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌… వైసీపీలో ఇమడలేకపోయారు.

కొద్దికాలంగా విశాఖ దక్షిణం నియోజకవర్గంలోని వైసీపీలో వర్గ పోరు కొనసాగుతోంది. దీంతో విసిగిపోయిన ఆయన నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను ఉత్తరాంద్ర వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డికి పంపారు.

Ambati Rambabu : వైసీపీలో అసంతృప్తి టీ కప్పులో తుపాను-అంబటి రాంబాబు

తనకు శల్య పరీక్షలు పెట్టడం, బల నిరూపణ చెయ్యాలని చెప్పడంతో వాసుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. శల్య పరీక్షలు, బల నిరూపణ వంటివాటితో… తన ప్రతిష్టకు భంగం కలిగిందని రాజీనామా లేఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ అరోపించారు.