బుల్లెట్ సౌండ్ పెంచొద్దు.. అతిక్రమిస్తే వాహనం సీజ్..!

  • Publish Date - November 1, 2020 / 06:30 PM IST

Bullet Loud Silencer : బైకులపై రయ్ మంటూ సైలెన్సర్ సౌండ్ మోగిస్తూ దూసుకెళ్లే వాహనదారులు జర జాగ్రత్త.. ఇకపై ద్విచక్రవాహనదారులు రోడ్లపై సైలెన్సర్లతో భారీ శబ్దాలు చేస్తే అంతే సంగతులు.. బుల్లెట్ వాహనదారుల్లో చాలామంది భారీ శబ్దాలను చేసే సైలెన్సర్లతో రోడ్లపైకి వచ్చేస్తున్నారు.



ఇలాంటి ఆకతాయిల ఆటకట్టించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపించారు.



భారీగా శబ్ధాలు చేసే వాహనాలను సీజ్ చేశారు. బుల్లెట్ వాహనాలకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ తీసేసి అధిక సౌండ్ వచ్చే వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



జంగారెడ్డి గూడెంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు కొత్త మోటార్ చట్టం ప్రకారం.. ద్విచక్రవాహనాన్ని మాఢిఫై చేసి సైలెన్సర్లను బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.