Vellampalli Srinivas
Vellampalli Srinivas: టీడీపీ, జనసేన మధ్య టూ సైడ్ లవ్ జరుగుతోందని అన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు డైరెక్షన్‌లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని అన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్.
2024 ఎన్నికల్లో జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని అన్నారు మంత్రి. ఎవరు పొత్తు పెట్టుకున్నా సింహం సింగిల్‌గా వచ్చినట్టు.. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు వెల్లంపల్లి శ్రీనివాస్.
దేశంలో అబద్దాల ఫ్యాక్టరీని చంద్రబాబు నడుపుతున్నారని విమర్శించారు మంత్రి కన్నబాబు. రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేకే చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రైతులకు సంబంధించి సమస్యలు ఉంటే వెంటనే పరిస్కారం చేస్తామన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను తమ ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. చంద్రబాబు రైతు కేంద్రంగా రాజకీయాలు నడపడం సరైంది కాదన్నారు.