Vemireddy Prabhakar Reddy: మళ్లీ అలిగిన ఎంపీ వేమిరెడ్డి.. ఏం జరుగుతుందో తెలుసా?

ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ వేమిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని వైసీపీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.

Vemireddy Prabhakar Reddy

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మళ్లీ అలకబూనారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీ చేయనున్నారు. అయితే, నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పేరు ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్నారు వేమిరెడ్డి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు వేమిరెడ్డి. పార్టీలో ఎవరికీ అందుబాటులో ఉండడం లేదు.

వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి కాని.. మదీనా వాచ్ కంపెనీ ఓనర్ ఇంతియాజ్‌కు కానీ.. నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి ప్రతిపాదించారు. తాను చెప్పింది వైసీపీలో జరగకపోవడంతో మనస్తాపం చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ వేమిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని వైసీపీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.

కాగా, రెడ్డి సామాజికవర్గం శాసిస్తున్న స్థానం నెల్లూరు పార్లమెంట్‌. ఇది వైసీపీకి కంచుకోటలా ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ సీటుతో పాటు అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసింది. మళ్లీ అదే రిపీట్ చేయాలని డిసైడ్ అయింది. వైసీపీని వ్యతిరేకత వెంటాడుతోంది.

Ganta Srinivasarao: తహసీల్దార్‌ను హత్య చేస్తే రాష్ట్ర హోం మంత్రి ఏం చేస్తున్నారు? సామాన్యుల పరిస్థితి ఏమిటి?