Ganta Srinivasarao: తహసీల్దార్‌ను హత్య చేస్తే రాష్ట్ర హోం మంత్రి ఏం చేస్తున్నారు? సామాన్యుల పరిస్థితి ఏమిటి?

తహసీల్దార్ కు రక్షణ లేకపోతే.. సామాన్యుల పరస్థితి ఏమిటని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Ganta Srinivasarao: తహసీల్దార్‌ను హత్య చేస్తే రాష్ట్ర హోం మంత్రి ఏం చేస్తున్నారు? సామాన్యుల పరిస్థితి ఏమిటి?

Ganta Srinivasarao

Updated On : February 3, 2024 / 1:30 PM IST

TDP Leader Ganta Srinivasarao : విశాఖలో తహసీల్దార్ రమణయ్య హత్య ఘటనపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. ప్రశాంతతకు మారుపేరు విశాఖ నగరంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళనకు గురిచేస్తుందని చెప్పారు. వైసీపీ పాలనలో విశాఖపట్టణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు భయపడుతున్నారని గంటా అన్నారు. గతంలో విశాఖ ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య విశాఖ వాసులను ఉలిక్కిపాటుకు గురిచేసిందని.. వైసీపీ ప్రభుత్వం విశాఖను నేర రాజధానిగా తయారు చేస్తోందని గంటా విమర్శించారు. ఎంపీ కిడ్నాప్ వ్యవహారంను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని గంటా వైసీపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. విశాఖలో ప్రైవేటు వ్యక్తుల దందాలు బాగా పెరిగాయి.. భూ మాఫియా రెచ్చిపోతుంది.. ఇప్పటికైన ప్రభుత్వం దృష్టిసారించాలని గంటా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read : BRS Leader Kavitha : గృహలక్ష్మీ పథకం ప్రారంభించడానికి ఆమెను ఏ హోదాలో పిలుస్తారు?

విశాఖలో నేరాలు పెరిగాయని కేంద్రం హోంశాఖ మంత్రే చెప్పారని టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రావు  గుర్తుచేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ది లేదు.. తహసీల్దార్ కు రక్షణ లేకపోతే.. సామాన్యుల పరస్థితి ఏమిటని గంటా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ను మర్డర్ చేస్తే రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తున్నారని గంటా ప్రశ్నించారు. భూమాఫియా వల్లనే తహసీల్దార్ హత్య జరిగిందని, ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని మాకు సమాచారం ఉందని గంటా అన్నారు.