Vemireddy Prabhakar Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు ఎంపీ వేమిరెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎంపీ పదవికి కూడా..
రాజ్యసభ సభ్యత్వానికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు పంపించారు. మరోవైపు వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి ఉత్తరాదిలోని టీటీడీ ఆలయ స్థానిక సలహామండలి చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించారు.
Also Read: పైకి పొత్తులు.. లోపల కత్తులు..? టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణం అదేనా?