Vidadala Rajini : మంత్రి పదవి దక్కిన ఆనందంలో విడదల రజిని
ఏపీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడంపై గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని సంతోషం వ్యక్తం చేశారు. కేబినెట్‌లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని
- chvmurthy
- Updated on- April 10, 2022 / 08:36 PM IST
Vidadala Rajini
Vidadala Rajini : ఏపీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడంపై గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని సంతోషం వ్యక్తం చేశారు. కేబినెట్‌లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సాధారణ బీసీ మహిళకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం, తనకు మంత్రి పదవి అవకాశం కల్పించడం కలలో కూడా ఊహించలేదని ఇది అనుకోకుండా వచ్చిన అదృష్టమని ఆమె అన్నారు.
Also Read : AP New Cabinet : బీసీ లంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్-సజ్జల
తనపై నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చినందుకు కష్టపడి పని చేస్తానని… ప్రభుత్వానికి, పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేబినెట్‌లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని రజిని పేర్కొన్నారు.
