Vidivada RamachandraRao : పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా నిరసన.. తణుకు జనసేనలో చల్లారని అసమ్మతి

ఆ సీటుకు అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి తనతో చర్చించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tanuku Janasena Protest

Vidivada RamachandraRao : పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జనసేనలో అసమ్మతి సెగలు చల్లారలేదు. ప్రజాగళం సభ వద్ద జనసేన అసంతృప్తి నేత విడివాడ రామచంద్రరావు అనుచరులు ఆందోళన చేపట్టారు. తణుకు జనసేన టికెట్ ఆశించి భంగపడ్డారు రామచంద్రరావు. ఆ సీటుకు అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి తనతో చర్చించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు నిరసన తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరయ్యే సభకు విడివాడ రామచంద్రరావు దూరంగా ఉన్నారు.

గతంలో తణుకులో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. తణుకు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు మాట ఇచ్చారు. అయితే, పవన్ కల్యాణ్ మాట తప్పారని విడివాడ ఆవేదన చెందారు. మాట తప్పడమే కాకుండా తణుకు నియోజకవర్గానికి వచ్చినా.. కనీసం పవన్ కల్యాణ్ తనను కలిసి సీటు గురించి చర్చించిన సందర్భం లేదని విడివాడ కొంత మనస్తాపానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలోనే ఆయన పెద్దఎత్తున జరుగుతున్న ప్రజాగళం సభకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో విడివాడ అనుచరులు పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కనీసం మర్యాదపూర్వకంగానైనా పవన్ కల్యాణ్ విడివాడను కలవకపోవడం బాధాకరమన్నారు. దీనిపై విడివాడ అనుచరులు ఆందోళనకు దిగారు.

Also Read : ఆ పార్టీకి పవన్ కల్యాణ్ పెద్ద కోవర్ట్: పోతిన మహేశ్