Vijayasai Reddy : కోటరీ వదలదు, కోట కూడా మిగలదు.. జరిగేది ఇదే.. విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్..!

Vijayasai Reddy : వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి వైఎస్ జగన్‌పై సంచలన ట్వీట్ చేశారు. కోటరీ వదలదు.. కోట కూడా మిగలదు.. ప్రజాస్యామ్యంలో కూడా జరిగేది ఇదే అంటూ ట్వీట్ చేశారు.

Vijayasai Reddy

Vijayasai Reddy : వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి వైఎస్ జగన్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యాలు, రాజులు, కోటరీలు, కోటలు అంటూ విజయసాయి ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read Also : Bajaj Electric : ఓలా, ఏథర్ ఇక కాస్కోండి.. బజాజ్ మరో సంచలనం.. పెట్రోల్ బండ్లు దండగ.. తక్కువ ధరలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందిగా..!

పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు.. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది.. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే.. ఆహా రాజా.. ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేవారు. దాంతో రాజూ పోయేవాడు.. రాజ్యం కూడా పోయేదని విజయసాయి ట్వీట్‌లో పేర్కొన్నారు.

కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు తెలివైన వాడు అయితే.. మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడని, వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడని తెలిపారు. కోటలో రాజుగారు బాగుండాలంటే.. సామాన్య ప్రజల్లోకి రావాలన్నారు. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి.

Read Also : SIP Investments : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా జస్ట్ రూ.1000 ఆదా చేయండి.. 20 ఏళ్లలో రూ.10 లక్షలపైనే సంపాదించుకోవచ్చు!

లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు.. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే” అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని ఆ కోటరీ వల్లే తాను దూరం కావాల్సి వచ్చిందని చెప్పారు. ఆయన చుట్టూ ఉన్నోళ్ల మాటలు వినొద్దని చెప్పినా తన మాట వినలేదన్నారు. తనతో విభేదాలు సృష్టించింది కోటరీలో వాళ్లేనని పేర్కొన్నారు.