Vijayawada Airport : త్వరలో అందుబాటులోకి విజయవాడ ఎయిర్‌పోర్టు నూతన రన్ వే

ఏపీలో అతిపెద్దది అయిన విజయవాడ ఎయిర్ పోర్టు రన్ వే జులై 15 నుండి అందుబాటులోకి రానుంది. రెండేళ్ల క్రితమే రన్ వే పనులు పూర్తయినా డిజీసీఏ నుండి అనుమతులు రాకపోవటంతో ప్రారంభానికి నోచుకోలేదు.

Vijayawada Airport

Vijayawada Airport : ఏపీలో అతిపెద్దది అయిన విజయవాడ ఎయిర్ పోర్టు రన్ వే జులై 15 నుండి అందుబాటులోకి రానుంది. రెండేళ్ల క్రితమే రన్ వే పనులు పూర్తయినా డిజీసీఏ నుండి అనుమతులు రాకపోవటంతో ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటికే డీజీసీఏ వర్చువల్ తనిఖీలు పూర్తి కాగా, ఎయిర్ పోర్టు అధికారులు ఫ్రిక్షన్ టెస్ట్ ను పూర్తి చేశారు. కొత్త రన్ వే పొడవు 3వేల 523 అడుగులు, పాత రన్ వే పొడవు 7వేల 500 అడుగులు.. రెండు రన్ వేలు కలిపితే మొత్తంగా 11,023 అడుగుల రన్ వే అందుబాటులోకి రానుంది.

వచ్చే నెలలో రన్ వే ప్రారంభమైతే అంతర్జాతీయ భారీ విమానాల రాకపోకలకు అవకాశం ఏర్పడనుంది. అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తే ప్రయాణికులకు తమ గమ్యస్ధానాలను చేరేందుకు విమానాలు మారాల్సిన కష్టాలు తప్పే అవకాశం ఉంటుంది. దీంతో పాటు విజయవాడకు ఎయిర్ ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటీష్ వాళ్లు తమ అవసరాల కోసం విజయవాడ సమీపంలోని గన్నవరం దగ్గర ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయగా ఇన్నాళ్ళకు అది అంతర్జాతీయ విమానాశ్రయం స్ధాయికి చేరనుండటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.