Drone Show
Drone Show: కేంద్ర పౌర విమానయాన శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన డ్రోన్ సమ్మిట్ -2024 కార్యక్రమం ఏపీలో రెండోరోజు జరుగుతుంది. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ లో ఈ డ్రోన్ సమ్మిట్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాత్రి 8.30గంటల సమయంలో అమరావతి రాజధానిలో కృష్ణా నది తీరంలో 5,500 డ్రోన్లు కళ్లు చెదిరే విన్యాసం చేశాయి. ఆకాశమే హద్దుగా అద్భుతాలు ఆవిష్కరించాయి. కేవలం 15 నిమిషాల్లోనే 5,500 డ్రోన్లు వివిధ ఆకృతుల్లో ఆకాశంలో విహరిస్తూ అబ్బురపరిచే విన్యాసాలు చేశాయి.
Also Read: Unstoppable with NBK: ధోనీ, కోహ్లీలలో సీఎం చంద్రబాబుకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో తెలుసా?
అమరావతి వేదికగా తొలి అంతర్జాతీయ స్థాయి డ్రోన్ల ప్రదర్శన ఇది. డ్రోన్లతో అతిపెద్ద ప్లానెట్ ఫార్మేషన్, అతి పెద్ద ల్యాండ్ మార్కు, అతిపెద్ద విమానం రూపకల్పన, అతిపెద్ద భారత జెండా, అతిపెద్ద ఏరియల్ లోగో ఫార్మేషన్ విభాగాల్లో ఈ ప్రదర్శనకు ఐదు గిన్నిస్ రికార్డులు దక్కాయి. ఆకాశంలో డ్రోన్ విన్యాసాలను సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు ఆసక్తిగా తిలకించారు.