Unstoppable with NBK: ధోనీ, కోహ్లీలలో సీఎం చంద్రబాబుకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో తెలుసా?
ఈ షోలో బాలయ్య కొన్ని రంగాలకు చెందిన ప్రముఖుల ఫొటోలను తెరపై చూపిస్తు వీరిలో ఎవరు మీకు ఇష్టం అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.

CM Chandrababu Naidu
CM Chandrababu Naidu : ఆహా ఓటీటీలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-4 అక్టోబర్ 25 నుంచి మొదలు కానుంది. ఇటీవలే సీఎం చంద్రబాబుతో మొదటి ఎపిసోడ్ షూట్ చేశారు. ఈ షోకి సంబంధించి ఇటీవల షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా ఈ ఎపిషోడ్ కు సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో సుమారు 5నిమిషాల 30 సెంకడ్లపాటు సాగింది. బాలయ్య, చంద్రబాబు మధ్య కాస్త సరదాగా, కాస్త సీరియస్ గా సంభాషణ సాగింది.
Also Read: అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ గ్లింప్స్ వచ్చేసింది..
ఈ షోలో బాలయ్య కొన్ని రంగాలకు చెందిన ప్రముఖుల ఫొటోలను తెరపై చూపిస్తు వీరిలో ఎవరు మీకు ఇష్టం అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఈ క్రమంలో క్రీడారంగానికి చెందిన క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఫొటోలను చూపిస్తూ.. బావ మీరేమో ధోనీ లాంటి లీడర్.. నేనేమో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్.. మరి మీరు ఆ ఇద్దరిలో ఎవరిని ఇష్టపడతారు అంటూ బాలయ్య చంద్రబాబును ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానమిస్తూ.. నేను ఎప్పుడూ విరాట్ కోహ్లీని ఇష్టపడతానని పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. పూర్తి ఎపిసోడ్ అక్టోబర్ 25 రాత్రి 8.30 గంటలకు ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.