Vijayawada : రేపటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోగాకు నిషేధం

తిరుమలలో మాదిరిగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి పొగాకు, వాటి ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు.

Vijayawada :  తిరుమలలో మాదిరిగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి పొగాకు, వాటి ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. దేవస్ధానం ఉద్యోగస్తులతోపాటు భక్తులు ఎవరూ కొండపైకి పొగాకు ఉత్పత్తులను తీసుకు వెళ్లరాదు. ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవాలయ పరిసర ప్రాంతాలలో పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం రేపటి నుంచి అమలు చేస్తారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై రూ. 20 నుంచి రూ.200 వరకు జరిమానా విధిస్తామని కలెక్టర్ ఢిల్లీ రావు హెచ్చరించారు. ఈరోజు దేవస్దానం కార్యాలయంలో జరిగిన డిక్లరేషన్ పై ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో లు సంతకాలు చేశారు.

ప్రస్తుతం ఈ తరహా చట్టం తిరుమలలో అమలవుతోంది. ఇప్పుడు విజయవాడ ఇంద్రకీలాద్రి రెండవది అవుతుంది. కార్లలో వచ్చే భక్తులను కూడా చెక్ చేసిన తర్వాతే కొండపైకి పంపిస్తామని కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు.

Also Read : Hawala Cash : చొక్కా విప్పితే లక్షల గుట్టు రట్టు-చెన్నైలో హవాలా మనీ స్వాధీనం

ట్రెండింగ్ వార్తలు