Lagadapati Rajagopal : మళ్లీ రాజకీయాలలోకి లగడపాటి ?

పొలిటికల్ ఆక్టోపస్ గా పేరు పొందిన విజయవాడ మాజీ  ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ తెర మీదకు వచ్చారు. వచ్చి  రావటంతోనే ప్రస్తుత రాజకీయాల్లో  కీలక నేతలతో సమావేశం అవుతున్నారు.  మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ తో ఆయన సమావేశం అయ్యారు.

Lagadapati Rajagopal :  పొలిటికల్ ఆక్టోపస్ గా పేరు పొందిన విజయవాడ మాజీ  ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ తెర మీదకు వచ్చారు. వచ్చి  రావటంతోనే ప్రస్తుత రాజకీయాల్లో  కీలక నేతలతో సమావేశం అవుతున్నారు.  మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ తో ఆయన సమావేశం అయ్యారు.

శనివారం నందిగామలో ఒక కార్యక్రమానికి హాజరైన లగడపాటి రాజగోపాల్  వైసీపీ ఎమ్మెల్యే   వసంత కృష్ణప్రసాద్ తో భేటీ అయ్యారు. అక్కడ వారిద్దరూ లంచ్ చేశారు.  అనంతరం స్ధానికంగా ఉన్న  పలువురు నేతలు, సీనియర్ రాజకీయ నేతలు పార్టీలకతీతంగా లగడపాటితో సమావేశం అయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగిన రాజగోపాల్, తాను నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్  విఫలం అవ్వటంతో    రాజకీయ సన్యాసం తీసుకున్నారు.  కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా  ఉన్న రాజగోపాల్  ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో అయిన భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులపై  చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే 2024 నాటి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ తర్వాత పలువురు నేతలు ఆయనతో సమావేశం అయి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించినట్లు సమాచారం.

Also Read : Gudivada Amarnath: వైసీపీకి ఏ పార్టీతో పొత్తులు అవసరం లేదు, చంద్రబాబు ఆశల కోసం పవన్ పనిచేస్తున్నారు: మంత్రి అమర్నాథ్

ట్రెండింగ్ వార్తలు