Kanakadurgamma Temple
Andhra Pradesh : వేసవికాలం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా అన్నదానం, మజ్జిగ పంపిణీలు చేయాలని నిర్ణయం తీసుకుంది.వేసవిలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించింది. అన్నదానం సందర్భంగా అన్నదాన భవనం, ప్రసాదం పోటుకి త్వరలోనే టెండర్లకు ఆహ్వానం పలకనుంది పాలకమండలి.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం సాయంత్రం సమయంలో అన్నదానం చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ప్రతినెలా రెండో గురువారం భక్త జన దర్భార్ నిర్వహించాలని..అలాగే కొండ దిగువలన పొంగళ్ల షెడ్డు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి పాలకమండలి ఆమోదం పలికింది. దాతలకు నెలకు ఒకసారి అంతరాలయం దర్శనం కల్పిస్తున్నామని..రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని మహాయజ్ఞం చేయనున్నామని దుర్గగుడ చైర్మన్ వెల్లడించారు. మే 13 నుంచి 15 వరకు మహాయజ్ఞం జరుగుతుందని తెలిపారు.