మహేశ్ మర్డర్ కేసు : కాల్పులు జరిపింది సుపారీ గ్యాంగ్, ఎవరు చంపించారు ?

  • Publish Date - October 19, 2020 / 09:10 AM IST

Mahesh murder : విజయవాడలో కలకలం రేపిన మహేశ్ మర్డర్ కేసులో సస్పెన్స్ వీడుతోంది. మహేశ్‌పై తుపాకీతో కాల్పులు జరిపింది ఓ సుపారీ గ్యాంగ్ అని తేలింది. ఐతే.. అతన్ని ఎవరు చంపించారు? హత్యకు ఎవరు సహకరించారన్న విషయాలు ఇప్పుడు మిస్టరీగా మారాయి. పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.



అతనిపై కాల్పులు జరిపిన సమయంలో.. ఘటనా స్థలానికి వచ్చింది ఇద్దరు షూటర్స్ మాత్రమేనని తేల్చారు. ఐతే.. మహేశ్‌ను హత్య చేసేందుకు.. నిందితులకు ఎవరు సహకరించాలనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా.. మహేశ్‌ను చంపేందుకు ఈ గ్యాంగ్‌కు సుపారీ ఎవరు ఇచ్చారన్న విషయంపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.



ఇప్పటికే మహేశ్ మర్డర్ కేసులో అతని స్నేహితుడు హరికృష్ణపై.. మహేశ్ సోదరి సునీత అనుమానం వ్యక్తం చేసింది. హరికృష్ణే.. తన అన్న మహేశ్‌పై కాల్పులు జరిపించాడని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో.. మహేశ్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరికృష్ణ వ్యవహారంపై కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.



త్వరలోనే నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. అప్పుడే.. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు బయటపడనున్నాయి. సస్పెన్స్ పూర్తిగా వీడనుంది.