Vijayawada
Vijayawada Railway Station : ప్రముఖ రైల్వే స్టేషన్ లలో విజయవాడ ఒకటి. ఈ రైల్వే స్టేషన్ న్యూ రికార్డు నెలకొల్పింది. దేశంలో 130 కిలోవాట్స్ సామర్థ్యం గల మొట్టమొదటి సోలార్ రైల్వే స్టేషన్ గా విజయవాడ రికార్డు సృష్టించింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇండియన్ రైల్వే పర్యావరణ అనుకూల చర్యలు తీసుకోవడం వల్ల వార్షికంగా రూ. 8 లక్షలకు పైగా పొదుపు కావడం..అంతేగాకుండా..కర్బన ఉద్గారాల శాతం కూడా తగ్గిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read More : New Ministers Take Charge: బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు
మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ లలో మొదటగా 130 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి గల స్టేషన్ గా రూపుదిద్దుకుందన్నారు. రైల్వే ట్రాక్షన్ విద్యుత్ అవసరాల కోసం ఖాళీగా ఉన్న రైల్వే భూముల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ మొత్తం విద్యుత్ వినియోగంలో 18 శాతం ఈ సౌరశక్తి నుంచి లభిస్తుంది.
Read More :Deep Dive Dubai : ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్..స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు
ఇక విజయవాడ రైల్వే స్టేషన్ విషయానికి వస్తే…2019 డిసెంబర్ లో 4, 5 ప్లాట్ ఫారాలపై 65 కిలోవాట్స్ సామర్థ్యం గల BIPV సోలార్ ప్యానల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రూ. 62 లక్షల ఖర్చుతో 4, 5 ప్లాట్ ఫారాలపై 54 కిలోవాట్స్ 8, 9 ప్లాట్ ఫారాలపై 11 కిలోవాట్స్ మొత్తం 65 కిలోవాట్స్ సామర్థ్యం గల BIPV సోలార్ ప్యానల్స్ తో ఏర్పాటు చేశారు.