Deep Dive Dubai : ప్ర‌పంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌..స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు

అది ప్రపంచంలోనే అత్యంత లోతైన పూల్. ఈ పూల్ లో స్విమ్మింగే కాదు స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు. ఇంత అద్భుతమైన పూల్ ను దుబాయల్ లో నిర్మించారు. అదే డీప్ డైవ్ దుబాయ్. ఈ పూల్ ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హెచ్‌హెచ్ షేక్ హ‌మ్‌దాన్ బిన్ మ‌హ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌క్తౌమ్ ప్రారంభించారు.

Deep Dive Dubai : ప్ర‌పంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్  పూల్‌..స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు

Deep Dive Dubai

Deep Dive Dubai : దుబాయ్‌. భూతల స్వర్గం. ఆకాశాన్ని తాకే భవనాలను చూస్తే కళ్లు చెదిరిపోతాయి. దుబాయ్ ఏం చేసినా ఓప్రత్యేకత ఉంటుంది. అటువంటిదే మరో అత్యద్భుతమైన పూల్ ను నిర్మించింది. ఈ పూల్ ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌. ‘డీప్ డైవ్ దుబాయ్‌’గా పిలుస్తున్న ఈ పూల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి. జులై 7న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హెచ్‌హెచ్ షేక్ హ‌మ్‌దాన్ బిన్ మ‌హ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌క్తౌమ్ ఈ స్విమ్మింగ్ పూల్ ప్రారంభించారు. ఆయ‌నే ఓ వీడియోను కూడా ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

డీప్ డైవ్ దుబాయ్ విశేషాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
ఈ డీప్‌డైవ్ దుబాయ్ స్విమ్మింగ్ పూల్ విశేషాలు మామూలుగా లేవు. స్విమ్మింగ్ అంటే ఇష్టపడేవారు ఒక్కసారి అయినా ఈ పూల్ లో డైవ్ కొట్టాలని కోరుకుంటారు. ఈ పూల్ లోతు 60 మీట‌ర్లు (196 అడుగులు). ఈ పూల్ ప్ర‌పంచంలోనే అత్యంత లోతైన పూల్‌గా గిన్నిస్ బుక్ గుర్తించింది. దీనికి సంధించిన ప్రెస్ నోట్ దుబాయ్ ప్ర‌భుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది. ఈ 60 మీట‌ర్ల లోతైన పూల్ లో 1.4 కోట్ల లీట‌ర్ల నీటిని నింప‌ే సత్తా కలిగి ఉంది.

అంతేకాదు ఈ పూల్‌లోప‌ల ఓ న‌గ‌రం కూడా ఉందంటే దాని రేంజ్ ఏంటీ ఊహించుకుంటేనే దాంట్లో ఈత కొట్టలేకపోయినా ఒక్కసారైనా చూసి తీరాలనిపిస్తుంది. మామూలు స్విమ్మింగే కాదు ఏకంగా సముద్రాల్లో చేసినట్లుగా ఈ పూల్ లో స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు. అంత భారీగా ఉంది మరి ఈ ‘డీప్ డైవ్ దుబాయ్’. ఈ పూల్ లో ఓ అపార్ట్‌మెంట్‌, గ్యారేజ్‌, ఆర్కేడ్ ఉన్నాయి. ఫ్రీ డైవింగ్, స్కూబా డైవింగ్ చేయాల‌నుకునే అవి రాకపోతే వారికి సహాయం చేయటానికి ఇక్కడ ఇంట‌ర్నేష‌న‌ల్ డైవింగ్ ప్రొఫెష‌న‌ల్స్ కూడా ఉన్నారు. దటీజ్ దుబాయ్..దటీజ్ ‘డీప్ డైవ్ దుబాయ్’. అని అనకుండా ఉండగలమా?!!