Andhra Pradesh : తొడలు కొట్టి .. మీసాలు మెలేస్తే నాయకులు కాలేరు : ఎంపీ కేశినేని నాని

తొడలు కొట్టి మీసాలు మెలేస్తే నాయకులు కాలేరని..ప్రజల మనస్సులు గెలవాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని .వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని..మరోసారి చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు.

TDP MP Keshineni Nani : విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తొడలు కొట్టి మీసాలు మెలేస్తే నాయకులు కాలేరని..ప్రజల మనస్సులు గెలవాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను సూచించారు. మరోసారి చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని..అన్ని రంగాల్లోను అభివృద్ధి కూలిపోయిందని జగన్ కు కూల్చివేతలు తప్ప నిర్మాణం చేయటం చేతకాదని ఎద్దేవా చేశారు. ఇటువంటి వ్యక్తి సీఎంగా ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని విజన్ ఉన్న నేత చంద్రబాబు మరోసారి సీఎం అయితేనే ఏపీ అప్పుల ఊబిలోంచి కోలుకుని అభివృద్ధి బాట పడుతుందని కార్యకర్తలకు కేశినేని నాని దిశానిర్దేశం చేశారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి సభలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కోసం ఎవరైతే నిస్వార్దంగా పని చేస్తారో వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని అన్నారు. మీడియా నుంచి ప్రజల నుంచే మంచి నాయకులు పార్టీ కోసం మందుకొస్తారంటూ కేశినేని వ్యాఖ్యలు చేసారు. ఎక్కడో తొడలు కొట్టిన వారు ఇక్కడ నాయకులు కాలేంరంటూ ఎంపీ కేశినేని పరోక్షంగా వైసీపీ నేతలపై విమర్శలు చేశారు.

చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో పార్టీలోని నేతలంతా కలిసి పని చేయాలని సూచించారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ఎన్ని మాటలు చెప్పినా మరోసారి జగన్ ని ప్రజలు నమ్మటానికి, మోసపోవటానికి సిద్దంగా లేరన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వ్యక్తిని చూసి ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో తనకు ఇదే నియోజకవర్గంలో మెజార్టీ వచ్చిందని, పార్టీ అభ్యర్ధి ఓడిపోయారని ఎంపీ నాని గుర్తు చేసారు. విజయవాడకు తాను లేకపోతే ఏదీ లేనట్లుగా సీఎం జగన్ మాట్లాడుతున్నారని, టీడీపీ హయాంలోనే నగరానికి మూడు ఫ్లై ఓవర్లు వచ్చాయని గుర్తు చేసారు. రాష్ట్రం మధ్యన అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో రాజధాని ఖరారు చేసారని.. అక్కడ ఉంటేనే అందరికీ ఉపయోగమని కేశినేని నాని అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు