Vijayasai Reddy : షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ నిజమేనా? ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ప్రచారం..

గతేడాదిలో షర్మిల, వైఎస్ జగన్ మధ్య నెలకొన్న ఆస్తుల తగాదా విషయంలో విజయసాయిరెడ్డి కొన్ని కామెంట్లు చేశారు.

Vijayasai Reddy : ఆయన ఈ మధ్యనే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక, పాలిటిక్స్ తో నాకు సంబంధం లేదు, హాయిగా వ్యవసాయం చేసుకుంటానన్నారు. ఆయనే విజయసాయిరెడ్డి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. 3 రోజుల క్రితం విజయసాయిరెడ్డి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను కలిశారని అంటున్నారు. ఈ ప్రచారం ఓ రేంజ్ లో సాగుతోంది. ఇంతకీ, ఆయన షర్మిలను కలిశారా? లేదా?

దాదాపు మూడు గంటల పాటు షర్మిలతో భేటీ?
ఈ మధ్యనే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కదలికలపై ఆసక్తి వ్యక్తమవుతోంది. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ఆయన చెప్పినా.. తాజాగా ఆయన గురించి ఓ ప్రచారం భారీగా సాగుతోంది. విజయసాయిరెడ్డి మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారని టాక్. అక్కడే లంచ్ కూడా చేశారట.

Also Read : వైసీపీ నుంచి వలసలు.. నాగబాబు సంచలనం.. మంత్రి పదవిపై హాట్ కామెంట్స్..

ఈ విషయం ఇప్పుడు అటు వైసీపీ, ఇటు కాంగ్రెస్ లో చర్చకు దారితీస్తోంది. అసలు నిజంగా భేటీ జరిగిందా లేదా అన్న సంగతి కూడా ఇంకా ఎవరూ కన్ ఫర్మ్ చేయలేదు.

పాత విషయాలను గుర్తు చేసుకుంటున్నారు..
గతేడాదిలో షర్మిల, వైఎస్ జగన్ మధ్య నెలకొన్న ఆస్తుల తగాదా విషయంలో విజయసాయిరెడ్డి కొన్ని కామెంట్లు చేశారు. షర్మిల వేరే పార్టీ చేతిలో పావులా మారారని, జగన్ అన్యాయం చేయలేదంటూ విజయసాయిరెడ్డి అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టారు. దానికి షర్మిల కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగానే ఆ విషయంపైన తన ఒపీనియన్ చెప్పారు. తాజాగా వీరిద్దరూ భేటీ అయ్యారనే టాక్ తో ఇప్పుడు ఆ పాత విషయాలు ఓసారి గుర్తు చేసుకుంటున్నారు జనం. మాజీ సీఎం జగన్ కి, షర్మిలకి ఉన్న వైరుధ్యాల నేపథ్యంలో ఈ భేటీ అంశం రాజకీయంగా కాక రేపుతోంది. అయితే, ఇదసలు నిజంగా జరిగిందా? లేక ప్రచారమేనా? అనేది కూడా తెలియదు.

Also Read : నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

రాబోయే రోజుల్లో వీరిద్దరూ ఏం చేయబోతున్నారు?
రాజకీయంగా తానిక యాక్టివ్ కాదని విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ ప్రచారాన్ని చూడాలి. గతంలో చేసిన విమర్శలపై షర్మిలతో ప్యాచప్ కోసం కూడా వెళ్లారనే మరో వాదనా ఉంది. అంతేకాదు వైఎస్ జగన్ తో విభేదాలను పరిష్కరించుకునేందుకే ఈ భేటీ జరిగిందనే టాక్ మరో వెర్షన్ గా వినిపిస్తోంది.

కొందరు మాత్రం షర్మిల, విజయసాయిరెడ్డి మధ్య రాజకీయపరమైన చర్చలే జరిగాయని అంటున్నారు. ఒకవేళ భేటీ పొలిటికల్ పరంగానే జరిగి ఉన్నట్లైతే రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు ఏం చేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.