MLA Bommidi Nayakar : నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

ఎమ్మెల్యే సేఫ్ గా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

MLA Bommidi Nayakar : నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Updated On : February 2, 2025 / 9:10 PM IST

MLA Bommidi Nayakar Car Incident : నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నం దగ్గర కారు వెళ్తుండగా బైక్ అడ్డు రావటంతో తప్పించే ప్రయత్నంలో కారు ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఉన్నారు. ఆయన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఎమ్మెల్యే సేఫ్ గా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : వైసీపీ నుంచి వలసలు.. నాగబాబు సంచలనం.. మంత్రి పదవిపై హాట్ కామెంట్స్..

సడెన్ గా అడ్డం వచ్చిన బైక్..
అమరావతిలో ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ప్రయాణిస్తున్న కారు మచిలీపట్నం సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డు అడ్డంగా సడెన్ గా బైక్ రావడంతో.. ఆ బైక్ ను తప్పించే క్రమంలో కారు కంట్రోల్ తప్పింది. ఎమ్మెల్యే నాయకర్ ప్రయాణిస్తున్న కారు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.

సేఫ్ గా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు..
అయితే, ఎమ్మెల్యే నాయకర్ సీటు బెల్టు పెట్టుకుని ఉండటంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన కారుని అక్కడే వదిలేసి.. మరో కారులో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నరసాపురంలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసి ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు, అనుచరలు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎమ్మెల్యే సేఫ్ గా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : వసుంధరకి ఎమ్మెల్యే టికెట్.. బాబు, బాలయ్య మధ్య చర్చలు.. ఫన్నీ ఫన్నీగా..

నరసాపురం-మచిలీపట్నం హైవేపై తరుచుగా ప్రమాదాలు..
కారులో ఉన్న వారంతా సీటు బెల్టు పెట్టుకోవడంతో సేఫ్ గా బయటపడ్డారని తెలుస్తోంది. నరసాపురం-మచిలీపట్నం హైవేపై వాహనాలు చాలా వేగంగా వెళ్తుంటాయి. అదే సమయంలో కొందరు బైకులతో రోడ్డుకు అడ్డంగా వస్తున్నారు. దాంతో ఇలాంటి ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆ రూట్ లో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు. అయితే, ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్పీడ్ ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.