Kapu Nadu Maha Sabha : విశాఖ కాపునాడు సభకు సంబంధించి రాజకీయ పార్టీలు ట్విస్ట్ ఇచ్చాయి. కాపునాడు సభకు దూరంగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. కాపునాడు సభకు కన్నా లక్ష్మీనారాయణ, బోండా ఉమ, గంటా శ్రీనివాస రావులు హాజరవుతారని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో మీటింగ్ కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. వైసీపీ, టీడీపీ, జనసేన నుంచి కూడా నేతలు హాజరు కావడం లేదు. మరోవైపు రాజకీయాలకు అతీతంగా సభ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.
Also Read..CM Jagan: గత ప్రభుత్వ పాలన దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా సాగింది: సీఎం జగన్
34 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ కాపునాడు జరగనుంది. కాపుల ఐక్యత ప్రధానంగా తలపెట్టిన ఈ సభలో ఎటువంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో భారీ డయాస్ ఏర్పాటు చేశారు. 2వేల 500 మంది సీటింగ్ కోసం కుర్చీలు వేశారు.
భారీ ఎత్తున కాపులతో సభను నిర్వహిస్తుండడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాపు సోదరులు తరలిరానున్నారు. కాపునాడు మహాసభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని, ఈ సభ ద్వారా ఏపీలో కాపులకు ఉన్న ప్రాధాన్యతను రాజకీయ పార్టీలకు తెలియ చేస్తామంటున్నారు కాపు నేతలు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
కాపునాడులో కాపులకు సంబంధించిన రిజర్వేషన్ల డిమాండ్ చర్చకు వచ్చే చాన్స్ ఉంది. అలాగే వచ్చే ఎన్నికల్లో కాపు సీఎం అన్న ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది.