CM Jagan: గత ప్రభుత్వ పాలన దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా సాగింది: సీఎం జగన్

గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఏ పథకం కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వ పాలన దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా జరిగిందని అన్నారు. ఇప్పుడు లబ్ధిదారులకు నేరుగా, ఏ అవకతవకలూ లేకుండా పథకాలు అందుతున్నాయని చెప్పారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని అన్నారు.

CM Jagan: గత ప్రభుత్వ పాలన దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా సాగింది: సీఎం జగన్

AP CM YS JAGAN

CM Jagan: గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఏ పథకం కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వ పాలన దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా జరిగిందని అన్నారు. ఇప్పుడు లబ్ధిదారులకు నేరుగా, ఏ అవకతవకలూ లేకుండా పథకాలు అందుతున్నాయని చెప్పారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని అన్నారు.

కడప జిల్లా కమలాపురంలో రూ.904 కోట్ల పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్ కన్నుమూసిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయని చెప్పారు. అనంతరం వాటిని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. మళ్ళీ ఇప్పుడు తమ ప్రభుత్వం ఆయా పనులు చేస్తోందని చెప్పుకొచ్చారు. గతంలోనూ అదే బడ్జెట్… ఇప్పుడూ అదే బడ్జెట్ అని అన్నారు.

అయినప్పటికీ గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు అమలు చేయలేపోయిందని నిలదీశారు. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి మధ్య తేడాలను గుర్తించాలని చెప్పారు. జనవరి నెలాఖరులోగా కడప స్టీల్ ప్లాంట్ పనులకు అడుగులు పడతాయని అన్నారు. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ.8800 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుపుతామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పై హామీ ఇచ్చిన గత పాలకులు దాన్ని పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు.

Pawan Kalyan: వీరసింహారెడ్డి అడ్డాలో వీరమల్లు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!