Visakha Police : న్యూఇయర్ వేడుకలకు విశాఖ నగరం సిద్ధమైంది. నగర వ్యాప్తంగా భారీగా ఈవెంట్లు నిర్వహించేందుకు ఆర్గనైజర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలపై విశాఖ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 1 గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీస్ శాఖ తేల్చి చెప్పింది.
Also Read : మీ కోసం జైల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ రెడీ!: వినూత్న రీతిలో తెలంగాణ పోలీసుల హెచ్చరిక
మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు బీచ్ రోడ్ లో వాహనాలను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. ఇక, పలు చోట్ల వాహనాలు దారి మళ్లించనున్నారు. డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఈవెంట్ లో సీసీ కెమెరాలు తప్పనిసరి అని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ప్రధాన కూడళ్లలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు.
విశాఖ నగరం మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు. బీచ్ రోడ్ మొత్తాన్ని మూసివేయనున్నారు. అలాగే బీఆర్టీఎస్ రోడ్ ను సైతం మూసివేయనున్నారు. అనుమతి తీసుకోకుండా ఈవెంట్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Also Read : న్యూఇయర్ సంబరాలు.. అక్కడ ఈలలు వేయడం, మాస్కులు పెట్టుకోవడంపై నిషేధం