New Year 2025: న్యూఇయర్ సంబరాలు.. అక్కడ ఈలలు వేయడం, మాస్కులు పెట్టుకోవడంపై నిషేధం
ప్రత్యేక పికెట్లను ఏర్పాట్లు చేసి, పోలీసులు మోహరించారు.

నూతన సంవత్సర వేడుకల్లో బెంగుళూరు రోడ్లపై, పబ్లిక్ ప్లేస్‌లలో యువత నానా హంగామా చేస్తారు. దీంతో యువత పోకిరీ వేషాలు వేయకుండా చేసేందుకు పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవాళ రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగర పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో ఈలలు వేయడం, మాస్క్‌లు పెట్టుకోవడంపై నిషేధం విధించారు.
ప్రత్యేక పికెట్లను ఏర్పాట్లు చేసి, పోలీసులు మోహరించారు. బెంగళూరు వ్యాప్తంగా 7,500 పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతను కల్పించడం, అవాంఛనీయ ఘటనలను నివారించడం కోసం పోలీసులు ఈ ఏర్పాట్లు చేశారు.
న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో గత నెలన్నర రోజులుగా పోలీసులు డ్రగ్స్‌పై డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేయడానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. బెంగళూరులో దాదాపు 8.5 లక్షల మంది న్యూఇయర్ వేడుకను జరుపుకోనున్నారని తెలిపారు.
బ్రిగేడ్ రోడ్, కమర్షియల్ స్ట్రీట్, కోరమంగళ, ఇందిరా నగర్ వంటి కీలక ప్రాంతాల్లో పోలీసులు పికెటింగ్‌లు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 11,830 మంది సిబ్బంది, సీనియర్ అధికారులు, సివిల్ డిఫెన్స్ సిబ్బందితో బెంగళూరులో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
మీ కోసం జైల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ రెడీ!: వినూత్న రీతిలో తెలంగాణ పోలీసుల హెచ్చరిక