మీ కోసం జైల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ రెడీ!: వినూత్న రీతిలో తెలంగాణ పోలీసుల హెచ్చరిక

"ప్రత్యేక ఆహ్వానితులుగా తాగి వాహనం నడిపేవాళ్లు.. రోడ్లపై స్టంట్లు చేసేవాళ్లు.. రోడ్లపై అల్లరి చేసేవాళ్లు.. ముఖ్య అతిథులుగా డ్రగ్స్ సేవించే వ్యక్తులు" వస్తారని పోలీసులు ట్వీట్ చేశారు.

మీ కోసం జైల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ రెడీ!: వినూత్న రీతిలో తెలంగాణ పోలీసుల హెచ్చరిక

Updated On : December 31, 2024 / 7:06 PM IST

న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ వేళ యువత రోడ్లపై వేసే వేషాలు అన్నీఇన్నీ కాదు. అర్ధరాత్రి న్యూఇయర్‌ వేడుకలు జరుపుకుని పబ్బులు, ఇతర ప్రదేశాల నుంచి బాగా మద్యం తాగి వెళ్తుంటారు. హైదరాబాద్‌లోనయితే ఈ కల్చర్‌ మరీ ఎక్కువైపోయింది. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుంటారు.

ప్రతి ఏడాది పోలీసులు ముందుగానే హెచ్చరిస్తున్నప్పటికీ చాలా మంది డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయి కేసులు ఎదుర్కొంటారు. దీంతో తెలంగాణ పోలీసులు ఇవాళ వినూత్న రీతిలో ట్వీట్ చేసి మందుబాబులను, పోకిరీలను హెచ్చరించారు.

“న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ కోసం పోలీసులు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించండి. ఇతరులను ఇబ్బంది పెట్టినా, డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ చేసినా, డ్రగ్స్‌ వాడినా జైలుపాలవ్వక తప్పదు. నిబంధనలను పాటించకపోతే ఉపేక్షించే ప్రసక్తేలేదు.

మీకోసం జైల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ రెడీ.. ప్రత్యేక ఆహ్వానితులుగా తాగి వాహనం నడిపేవాళ్లు.. రోడ్లపై స్టంట్లు చేసేవాళ్లు.. రోడ్లపై అల్లరి చేసేవాళ్లు.. ముఖ్య అతిథులుగా డ్రగ్స్ సేవించే వ్యక్తులు. మీ కోసం తెలంగాణ పోలీసులు బేడీలతో రెడీగా ఉన్నారు. సాయం కోసం డయల్ 100ను సంప్రదించండి” అని తెలంగాణ పోలీసులు తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో ట్వీట్ చేశారు.

కొత్త సంవత్సర వేడుకల్లో చేయకూడనివి..
-మద్యం తాగి వాహనాలు నడపకూడదు
– ⁠రోడ్లపై మద్యం తాగటం, కేక్ కటింగ్ లాంటివి చేయకూడదు
– ⁠డీజేలు పెట్టకూడదు
– ⁠టపాసులు కాల్చి ఇతరులను ఇబ్బంది కలిగించకూడదు
– ⁠డ్రగ్స్ జోలికి వెళ్లవద్దు, డ్రగ్స్ ఉన్న పార్టీలలో పాల్గొన్నా కూడా ఇబ్బందులు తప్పవు

 

Yearly Horoscope 2025: ఈ ఏడాది మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఈ రాశి వారికి ఏడున్నర సంవత్సరాల శనిపీడ నుంచి రిలీఫ్