Vizag Steel Plant EOI Bidding
Vizag Steel Plant EOI Bidding : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇటు తెలంగాణ అటు ఏపీలోను హీట్ పుట్టిస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది కానీ కేంద్రాన్ని మాత్రం ప్రశ్నించటంలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాము స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొంటున్నామని ప్రకటతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఏపీ మంత్రులు తెలంగాణ నేతలపై విమర్శలు వారి తిరిగి ప్రతి విమర్శలు కొనసాగుతుంటే కేంద్రం మాత్రం వినోదం చూస్తోంది.
తాపీగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ అంశం ముందుకు వెళ్లటంలేదని ఒకసారి..ఈ అంశాన్ని వదిలేది లేదు ప్రైవేటీకరణ జరిగి తీరుతుంది అంటూ మరో సారి ప్రటనలు చేస్తూ గేమ్ ఆడుతోంది. మీరు కూడా కొట్టుకుచావండీ చేయాల్సింది మేం చేస్తాం అన్నట్లుగా ఉంది కేంద్రం తీరు..ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఆయా కంపెనీలు దక్కించుకోవటానికి బిడ్లు వేశాయి. బిడ్ల దాఖలు విషయంలో అనూహ్య స్పందన వస్తోంది. ఈరోజు మధ్యాహ్నాం వరకు బిడ్లు దాఖలు చేయటానికి అవకాశం ఉండగా ఇప్పటి వరకు 22 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. వీటిలో ఆరు విదేశీ కంపెనీలు ఉండగా 16 స్వదేశీ కంపెనీలు ఉన్నాయి. ఈక్రమంలో సింగరేణి సంస్థ బిడ్ వేస్తుందా? లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇవే బిడ్లు వేసిన కంపెనీలు..
1. ఇండో ఇంటర్ ట్రేడ్ ఏజీ (స్విట్జర్లాండ్)
2. ఇండో ఇంటర్నేషన్ ట్రేడిండ్ (దుబాయ్)
3.ఐఎంఆర్ మెటలర్జికల్ రిసోర్సెస్ ఏజీ
4.సూరజ్ ముల్ బైజ్యనాథ్ ప్రైవేట్ లిమిటెడ్ (కోల్ కతా)
5.జేఎస్ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్
6.వినార్ ఓవర్ సీస్ (ముంబై)
7.రిసోర్స్ కో లిమిటెడ్ (ముంబై)
8.టీయూఎఫ్ గ్రూప్ (ఢిల్లీ)
9.జిందాల్ స్టీల్ అండ్ పవర్ (అంగుల్)
10.అగోరా పార్టనర్స్ (ఢిల్లీ)
11.శ్రీ సత్యం ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్
12.ఎస్ బీ ఇంటర్నేషనల్ ఇన్ కార్పొరేషన్ (డల్లాస్)
13.టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్
14.యురోప్ ఇంపోర్ట్ ఎక్స్ పోర్ట్ లిమిటెడ్
15.హెచ్ఎస్సీఓడీ ఈఎస్ ప్రైవేట్ లిమిటెడ్
16. గ్లోబల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెండ్ (సింగపూర్)
17.వెన్ ప్రా ఇంపెక్స్ (విజయవాడ)
18.ఎలిగెంట్ మెటల్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్
19.ఎల్ కే శ్రీ ఎంటర్ ప్రైజెస్ ఎల్ఎల్ పీ (ముంబై)
20.అరోగ్లోబలర్ కామ్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ (భువనేశ్వర్,ఒడిశా)
21.ఎవెన్ స్టీల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెండ్ (లూథియానా)
22.వాడిమ్ నోవిన్ స్కై అలెగ్జాండ్రా-రూటేజ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ (బెంగళూరు)
కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ప్రైవేట్ కంపెనీలను అనుమతించవద్దని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలే విశాఖ స్టీల్ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈక్రమంలో బ్లాస్ట్ ఫర్నేస్ -3ని రన్నింగ్ లో పెట్టేందుకు RINL యత్నిస్తోంది.ముడిపదార్ధాలు ఇస్తే స్టీల్ ఇస్తామని ప్రటించగా రూ.5వేల మూలధనం సమకూర్చే కంపెనీలకు ఆహ్వానం పలికింది. కాగా నేటిలో Vizag Steel Plant EOI Bidding సమయం ఈరోజుతో ముగియనుంది. మూడు గంటల వరకే సమయం ఉంది.
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ కు ఎవరు అర్హులు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..