Asani Cyclone : అసానితో ఏపీకి ఎలాంటి ముప్పు లేదు : విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్

మచిలీపట్నం నుండి చైన్నె వరకు ఉపరితల అవర్తనం కొనసాగుతుందన్నారు. అందువల్ల ఈదురుగాలులు ఉరుములు మెరుపులుతో కూడిన గాలలు వీస్తున్నాయని పేర్కొన్నారు.

Asani cyclone : బంగాళఖాతంలో అసాని తీవ్ర తుఫాన్ కొనసాగుతుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద పేర్కొన్నారు. విశాఖకు ఆగ్నేయ౦గా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. ప్రస్తుతం 40 నుండి 50 కిలో మీటర్ల వేగంతో అత్యదికంగా 60 కిలోమీటర్ల వేగంతో ఏపీ తీరం వెంబడి గాలులు వీస్తున్నాయని చెప్పారు.

రేపటి నుండి ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలోని అన్ని ఓడ రేవులలో 2వ నె౦బర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. నేటి నుండి ఈ నెల 12వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెల్లరాదని సూచించారు. మంగళవార౦ మధ్యాహ్నానానికి బలహీన పడుతూ తీవ్ర తుఫాన్…తుఫాన్ గా మారే అవకాశం ఉందన్నారు.

Rain Alert For Telangana : తెలంగాణకు చల్లని కబురు.. 3 రోజులు వర్షాలు

తుఫాన్ ఎక్కడ తీరం దాటే అవకాశం లేదని తెలిపారు. మచిలీపట్నం నుండి చైన్నె వరకు ఉపరితల అవర్తనం కొనసాగుతుందన్నారు. అందువల్ల ఈదురుగాలులు ఉరుములు మెరుపులుతో కూడిన గాలలు వీస్తున్నాయని పేర్కొన్నారు. గడిచిన 6గ౦టలలో గంటకు 25 కిమీ వేగంతో ఉత్తరాంధ్ర తీరం వైపుకు అసాని వస్తుందని చెప్పారు. ఏపీకి ఎటువంటి ముప్పు లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు