Rain Alert For Telangana : తెలంగాణకు చల్లని కబురు.. 3 రోజులు వర్షాలు

తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంది.

Rain Alert For Telangana : తెలంగాణకు చల్లని కబురు.. 3 రోజులు వర్షాలు

Rain Alert For Telangana

Rain Alert For Telangana : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండల ధాటికి, ఉక్కపోతకి జనాలు విలవిలలాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. తెలంగాణకు వర్ష సూచన చేసింది.

తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయంది. విదర్భ నుంచి కర్నాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వానలు పడతాయంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడిందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. రాగల 12 గంటల్లో తుఫాను తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Asani Cyclone : బంగాళాఖాతంలో అసాని తుఫాను.. గంటకు 13 కి.మీ వేగంతో పయనం

కాగా, శనివారం కరీంనగర్‌లోని జమ్మికుంటలో అత్యధికంగా 44.4 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో 44.3, భూపాలిపల్లిలోని కొత్తపల్లిగోరిలో 44.1, సూర్యాపేట జిల్లాలోని కీతవారిగూడెలంలో 44 డిగ్రీలు, ఆదిలాబాద్‌లోని చాప్రాలలో 43.9 డిగ్రీలు, కామారెడ్డిలోని బిక్నూర్‌లో 43.8, ఖమ్మం జిల్లాలోని నాగులవంచలో 43.6 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Rain Alert For Telangana, Rains For Three Days

Rain Alert For Telangana, Rains For Three Days

ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. తుఫానుకు “అసని”గా నామకరణం చేశారు. గంటకు 16 కి.మీ వేగంతో కదులుతున్న అసని తుఫాను విశాఖపట్నంకు ఆగ్నేయంగా 970 కి.మీ దూరంలో ఉంది. ఒడిశా పూరీకి 1030 కి.మీ దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

వాయువ్య దిశగా కదులుతున్న ఈ అసని తుఫాను రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మే 10న ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఇది బలహీన పడే అవకాశం ఉందన్నారు. అసని ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేటి అర్థరాత్రి నుంచి గంటకు 105 నుంచి 125 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయని, తుఫాను ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపారు.

Cyclone Asani: ముంచుకొస్తున్న ‘అసని’: తూర్పు తీరానికి తీవ్ర తుఫాను హెచ్చరిక

10వ తేదీ సాయంత్రం నుంచి ఒడిశా తీరప్రాంతం, ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల మీదుగా అసని సాగనుంది. తుఫాను ప్రభావంతో కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 9, 10 తేదీల్లో బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.