Asani Cyclone : బంగాళాఖాతంలో అసాని తుఫాను.. గంటకు 13 కి.మీ వేగంతో పయనం

ఉత్తరాంధ్రలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేక 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు వేగముతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు.

Asani Cyclone : బంగాళాఖాతంలో అసాని తుఫాను.. గంటకు 13 కి.మీ వేగంతో పయనం

Asani (1)

Asani cyclone : బంగాళాఖాతంలో ఆసని తుఫాను కొనసాగుతోంది. గంటకు 13 కి.మీ వేగంతో పయనిస్తోంది. పోర్ట్ బ్లెయిర్ కి 400 కి.మీ., విశాఖకు 940 కి.మీ, పూరీకి ఆగ్నేయంగా 1000 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. మే 10వ తేది సాయంత్రానికి వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద కేంద్రీకృతమవుతుంది. ఒడిషా తీరానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేక 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు వేగముతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫాన్.. 2022లోనే మొదటి తుఫానుగా భారత వాతావరణశాఖ తెలిపింది. అసాని మే 10న ఆంధ్ర – ఒడిశా లేదా ఒడిశా – పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో గాలుల వేగం 90 కి.మీల వరకు ఉంటుందని అధికారులు హెచ్చరించారు. తుఫాను ధాటికి మే 8 నుంచి బెంగాల్‌, ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను నేపథ్యంలో అండమాన్ సహా ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Cyclone Asani: ముంచుకొస్తున్న ‘అసని’: తూర్పు తీరానికి తీవ్ర తుఫాను హెచ్చరిక

తుఫాను ప్రభావం ఎక్కువగా ఒడిశాపైనే ఉంటుందన్న అధికారులు ఆమేరకు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో ఒడిశా మొత్తం హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఒడిఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పికె జెనా తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సూచన మేరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లినవారిని వెనక్కు పిలిపించినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు పికె జెనా పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ తీరంలోని విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు అసని తుఫాను ప్రభావం ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో స్థానిక విపత్తునిర్వహణశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, కుండపోత వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ సంచాలకులు వివరించారు. కాగా 2021 మే నెలలోను యాస్ తుఫాను తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.