Visakhapatnam Railway Zone (Photo Credit : Google)
Visakhapatnam Railway Zone : విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటులో కీలక ముండగు పడింది. సౌత్ కోస్టల్ జోన్ నిర్మాణం కోసం రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వచ్చే నెల 27వ తేదీ వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చింది. రైల్వే జీఎం కార్యాలయం నిర్మాణంలో జీ+9, బీ1, బీ2 నిర్మాణాలు చేపట్టాలని నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావాలనే కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. గత కొన్ని రోజులుగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కాలయాపన జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు రైల్వే శాఖ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పేరిట ఏర్పాటు చేసేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 27వ తేదీ వరకు ఆసక్తి కల వారు టెండర్ లో పాల్గొని బిడ్డింగ్ దాఖలు చేయవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కు సంబంధించి జీఎం కార్యాలయం ఉంటుంది.
జీఎం కార్యాలయం భవనం ఏ రకంగా ఉంటుంది, దాని నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగింది. ప్రాథమికంగా ఇప్పుడున్న అంచనా ప్రకారం చూసుకుంటే రైల్వే జీఎం హెడ్ క్వార్టర్స్ కు సంబంధించి కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్, బీ 1, బీ2 అనే నిర్మాణాలు చేపట్టాలని రైల్వే శాఖ టెండర్ లో పేర్కొంది. ఈ నిర్మాణం అంతా కూడా దాదాపు రెండేళ్లలో పూర్తి చేయాలని నియమ నిబంధనలలో రైల్వే శాఖ పేర్కొంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో ఒకటిగా ఉంది. రైల్వే కార్యాలయం నిర్మాణానికి సంబంధించి టెండర్ పిలవడంతో కచ్చితంగా రైల్వే జోన్ ఏర్పాటు కాబోతోంది అనే సంకేతాలను ప్రజలకు ఇచ్చినట్లైంది. రైల్వే జోన్ సాధన కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు దశాబ్దాల తరబడి కొనసాగాయి.
Also Read : చంద్రబాబును తిట్టిన వాళ్లను వదిలేది లేదు- కొడాలి నాని, వంశీల బుద్దా వెంకన్న ఫైర్