CBI : వివేకా హత్య కేసు, సమాచారం ఇస్తే..రూ. 5 లక్షలు బహుమతి

వైఎస్ వివేకా హత్య కేసులో ఎదైనా సమాచారం తెలిస్తే ఇవ్వాలంటూ ప్రజలను సీబీఐ కోరింది. వారికి రూ. 5 లక్షల నజరానా ఇస్తామని సీబీఐ అధికారులు ప్రకటించారు.

CBI : వివేకా హత్య కేసు, సమాచారం ఇస్తే..రూ. 5 లక్షలు బహుమతి

Cbi

Updated On : August 21, 2021 / 9:30 AM IST

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో ఎదైనా సమాచారం తెలిస్తే ఇవ్వాలంటూ ప్రజలను సీబీఐ కోరింది. ఈ మేరకు 2021, ఆగస్టు 21వ తేదీ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. వివేకా హత్యకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు ఇవ్వాలని, సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇస్తామని సీబీఐ అధికారులు ప్రకటించారు.

ఇప్పటికే పలువురు అనుమానితులను సీబీఐ విచారించింది. నలుగురి వద్ద పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. సమాచారం ఇవ్వాలి అనుకున్న వ్యక్తులు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి డీఎస్పీ దీపక్ గౌర్ (9474256974), పర్యవేక్షణ అధికారి ఎస్పీ రామ్ సింగ్ (9988272709) నెంబర్లకు వివరాలు అందించాలని సీబీఐ అధికారులు కోరారు.

Read More : శ్రీలంకలో లాక్‌డౌన్

వైఎస్ వివేకా హత్య అనంతరం ఈ కేసును సీబీఐకు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విచారణ జరుపుతోంది. పలువురిని విచారించారు కూడా. కానీ అసలు హత్య ఎవరు చేశారన్నది ఇప్పటికీ తేలలేదు. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని మరోసారి సీబీఐ అధికారులు విచారించారు.

Read More : Afghanistan : అప్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ఆఫీసులో తాలిబన్లు

ఈ కేసులో సునీల్‌ కీలకంగా మారాడు. ఇతనికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని జమ్మలమడుగు కోర్టును సీబీఐ అభ్యర్థించింది. సీబీఐ అధికారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు వివేకా కుమార్తె సునీత రెడ్డి. మరి వైఎస్ వివేకా హత్య కేసులో తెలిసిన సమాచారాన్ని సీబీఐకి ప్రజలు ఇస్తారా ? లేదా ? అనేది చూడాలి.