×
Ad

నిరాశలో గొల్ల బాబూరావు.. పార్టీ పరంగా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదా?

వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి జర్నీ స్టార్ట్ చేసి 2012 బైఎలక్షన్, 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

Golla Babu Rao (Image Credit To Original Source)

  • పదవి ఉంది సరే.. రెస్పెక్ట్ ఏది..?
  • రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు 
  • అయినా గౌరవం దక్కట్లేదన్న ఫీలింగ్!

Golla Babu Rao: గొల్ల బాబూరావు. ఒకప్పుడు ఆయనో గ్రూప్ వన్ ఆఫీసర్. ఇప్పుడు పెద్దల సభలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు. షార్ట్ టర్మ్‌లో పొలిటికల్ లక్కీ ఛాన్స్ కొట్టి రాజ్యసభకు వెళ్లిన ఆయనకు ఇప్పుడో డౌట్ కొడుతోందట. 16 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఎన్నో ఎత్తులు..పల్లాలు చూసిన ఆయనకు అస్సలు మనసు కుదట పడట్లేదట. నా సేవలను వాడుకోండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారట.

కాస్త వెయిట్ చెయ్‌..టైమ్‌ వచ్చినప్పుడు మా వాడకమేంటో చూపిస్తామని వైసీపీ పెద్దలు చెప్తున్నా..బాబూరావు మాత్రం నో కాంప్రమైజ్‌ అంటున్నారట. ఇప్పుడే తన వర్క్‌ స్టైల్‌ ఏంటో చూపిస్తానంటూ ఆసక్తి చూపిస్తున్నారట. చెప్పుకోదగ్గ పదవి ఉన్నా..పార్టీ మీటింగ్‌లలో..చివరకు అధినేత పర్యటనలకు కూడా తనకు ప్రత్యేక ఆహ్వానం లేదంటూ అనుచరుల దగ్గర ఫ్రస్టేట్ అవుతున్నారట.

రాజ్యసక్ష సభ్యుడిగా హోదా ప్రకారం ప్రోటోకాల్‌ ఇచ్చి ప్రభుత్వ అధికారులు గౌరవ మర్యాదలు పాటిస్తున్నా సరే, పార్టీ పరంగా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని తెగ బాఢపడిపోతున్నారట. వైసీపీ అధికారం అనేక కీలక సమావేశాలు, నిరసనలు, సభలు నిర్వహించినా సరే ఓ దళిత రాజ్యసభ సభ్యుడుగా తనకు మినిమం ప్రయారిటీ ఇవ్వలేదన్న ఫీలింగ్‌ ఆయనలో ఎక్కువైపోయిందట. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ చేపట్టినా కార్యక్రమాల్లో గొల్ల బాబూరావు ఎక్కడా కనిపించలేదు.

Also Read: రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కసరత్తు స్పీడప్.. ఆ నెలలో పార్టీపై ప్రకటన? తర్వాత పాదయాత్ర..!?

దళితులపై దాడులు, వివాదాల అంశంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శలకు వెళ్లినా సరే గొల్ల బాబూరావుకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదట. దళిత సామాజికవర్గం నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్నా సరే కనీసం ఆహ్వానం లేకపోవడం..పార్టీ తరుఫున తన వాయిస్ కూడా ప్రజల్లోకి వెళ్లకుండా చేయడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందనేది గొల్ల బాబూరావు అనుమానమట. ఇటీవల ఆయన ఫ్రస్ట్రేషన్‌ స్లో..స్లోగా మొదలై, ఇప్పుడు పీక్స్‌కు చేరిందట.

జగన్‌ దగ్గరే పంచాయితీ పెట్టాలని ఫిక్స్!
త్వరలో పార్టీ అధ్యక్షుడు జగన్‌ దగ్గరే పంచాయితీ పెట్టాలని ఫిక్స్ అయిపోయారట గొల్ల బాబూరావు. కేవలం తన భవిష్యత్తుకు మాత్రమే పరిమితం కాకుండా, వైసీపీలో తన కుమారుడు పొలిటికల్ ఫ్యూచర్‌పై కూడా తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. పెద్దల సభకు ప్రాతనిధ్యం వహిస్తున్నా సరే పార్టీలో తన ప్లేస్ ఏంటో తనకే తెలియక కన్ఫ్యూజన్‌లో పార్టీలో ఎవరిని ఎటాక్ చేయాలో తెలియక గొల్ల అయోమయంలో అల్లాడిపోతున్నారట.

గొల్ల బాబూరావు..వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్‌ వెంట నడిచారు. పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీని పటిష్టం చేశారు. టీడీపీకి కంచుకోట వంటి పేట కోటను బద్దలు కొట్టి గొల్ల బాబూరావు తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. మొదటి గ్రూప్ వన్ ఉద్యోగం చేసుకునే గొల్ల బాబూరావు 2009లో ఫస్ట్ టైమ్‌ కాంగ్రెస్ పార్టీ తరఫున పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు.

వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి జర్నీ స్టార్ట్ చేసి 2012 బైఎలక్షన్, 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడంతో పార్టీలో సీనియార్టీ పరంగా, జగన్‌తో ఉన్న సాన్నిహిత్యంతో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు గొల్ల బాబూరావు. కానీ ఆయనకు భంగపాటు తప్పలేదు. వైసీపీ హయాంలో సెకండ్ టర్మ్‌లోనైనా మంత్రి పదవి వస్తుందని ఆశలు పెంచుకోగా, అవి కూడా అడియాశలయ్యాయి.

వార్నింగ్‌లు.. అప్పట్లో ఫ్యాన్ పార్టీలో దుమారం
అప్పటి నుంచి వైసీపీలో సీనియారిటీ, జగన్ పట్ల సిన్సియారిటీని పక్కన పెట్టి పార్టీకి వ్యతిరేకంగా, అధినేత జగన్‌ను లెక్క చేయకుండా గొల్ల బాబూరావు రచ్కకెక్కడం మొదలు పెట్టారు. మంత్రి పదవి దక్కకపోవడం, అవమానకరంగా, ఆత్మగౌరవ వ్యవహారంగా ఫీల్ కావడంతో బాబూరావు తన పొలిటికల్ మైండ్‌కు పని చెప్పారు. కొందరు పార్టీ పెద్దలు తన మంత్రి అవకాశాలకు అడ్డుపడ్డారని, సందర్భం వచ్చినప్పుడు తనలో విప్లవకారుడిని చూస్తారంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్‌లు అప్పట్లో ఫ్యాన్ పార్టీలో దుమారం రేపాయి.

అయితే 2024 ఎన్నికల నాటికి పాయకరావుపేటలో అంతర్గత రాజకీయాలు అదుపు తప్పడంతో ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూరావును కాదని..పొరుగు జిల్లాకు చెందిన కంబాల జోగులును బరిలోకి దించింది వైసీపీ. ఇది అట్టర్ ప్లాఫ్ పొలిటికల్ ఎక్స్‌ పరిమెంట్‌గా ఎలక్షన్ రిజల్ట్‌ వచ్చాక గాని వైసీపీకి అర్థం కాలేదు. ఈ పరిణామాల తర్వాత గొల్ల బాబూరావు రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడ్డట్లు అయింది.

కానీ, అదృష్టం ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌రూ ఊహించ‌లేరన్నట్టు రాజ్యసభ సీటు బాబూరావుని వెతుక్కుంటూ వచ్చి ఆయన ఇంటి ముందు వాలిపోయింది. దీంతో గొల్ల బాబూరావు మంత్రి పదవి రాకపోయినా సరే ఏదో రాజ్యసభ దక్కిందని సరిపెట్టుకుని ఢిల్లీకి పయనమైపోయారు. కానీ ఇప్పుడు సరైన ప్రాధాన్యత దక్కట్లేదు..తన సేవలను సరిగ్గా వాడుకోవట్లేదన్న ఆవేదనలో ఉన్నారట ఆయన.

త్వరలో అధినేతను కలిసి తన మనసులో మాటను చెప్పడంతో పాటు..తన కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్‌పై కూడా జగన్‌ను ముందు ఓ ప్రపోజల్ పెట్టాలని డిసైడ్‌ అయ్యారట. మరి బాబూరావు రిక్వెస్ట్‌ను జగన్ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారో..ఆయన సేవలను పార్టీ ఎలా వాడుకుంటుందో వేచి చూడాలి.