Ganesh Mandapam Police Website: ఏపీలో గణేష్ మండపం పెట్టాలనుకుంటున్నారా? పోలీసులు ఇచ్చిన వెబ్ సైట్ ఇదే.. అప్లై చేసుకోండి..

నిబంధనల ప్రకారం ఉంటే QR కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారని ఆయన వివరించారు.

Ganesh Mandapam Police Website: వినాయక చవితి సమీపిస్తోంది. వినాయక చవితి అంటే సంబరాలు అంబరాన్ని తాకేలా ఉంటాయి. ఇక, వీధి వీధిలో గణేశ్ మండపాలు వెలుస్తాయి.

ఎప్పటిలాగే ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణేశ్ మండపాలు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే, ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే గణేశ్ మండపాలు పెట్టేందుకు పోలీసుల పర్మిషన్ తప్పనిసరి. అందుకే, గణేశ్ మండపాలు పెట్టాలని అనుకునే వారి కోసం పోలీసులు ఒక వెబ్ సైట్ ఇచ్చారు.

ఇందులో అప్లయ్ చేసుకోవాలని సూచించారు.

వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ganeshutsav.net అనే వెట్ సైట్ ను ప్రారంభించిందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. మండపాల నిర్వాహకులు

ఈ వెబ్ సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్ లైన్ లో అనుమతులు పొందవచ్చని చెప్పారు.

అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉంటే QR కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారని ఆయన వివరించారు.

అయితే, బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు మాత్రమే ఈ అనుమతులు తప్పనిసరి అని క్లారిటీ ఇచ్చారు.

ఈ ఆన్‌లైన్ వ్యవస్థ ఉత్సవాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఉద్దేశించబడిందని డీజీపీ తెలిపారు.

Also Read: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. తిరుమల వెళ్లే మహిళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్..