Konaseema Tension : హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు : ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు

కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలని జేఏసీ నేతలు, యువకులు చేపట్టిన నిరసన ఈరోజు ఉద్రిక్తతలకు దారితీసింది.

Konaseema Tension : కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలని జేఏసీ నేతలు, యువకులు చేపట్టిన నిరసన ఈరోజు ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు కలెక్టరేట్ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు.
పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి చేయి దాటి పోయింది. రవాణాశాఖ మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆర్టీసి బస్సులకు,  ప్రైవేట్ వాహనాలకు నిప్పు పెట్టారు.

సమాచారం తెలుసుకుని అదనపు బలగాలతో అమలాపురం చేరుకున్న ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు పరిస్ధితిని సమీక్షించారు. ఆందోళనకారులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారని ఆయన చెప్పారు. దాడులు చేసిన ఆందోళనకారులపై చర్యలు ఉంటాయన్నారు. సీసీఫుటేజ్‌ ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని… అమలాపురం పూర్తిగా పోలీసుల ఆధీనంలోనే ఉందని చెప్పారు.

పుకార్లను ఎవరూ నమ్మవద్దని.. హింసాత్మక సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఐజీహెచ్చరించారు. యువత హింసకు పాల్పడి భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని డీఐజీ పాలరాజు సూచించారు.

Also Read : Konaseema Tension : కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి-చంద్రబాబు నాయుడు

ట్రెండింగ్ వార్తలు