AP Rain Alert : భారీ వానలు..! ఏపీకి మరోసారి వర్ష సూచన, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరిక

మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది.

AP Rain Alert : ఏపీకి మరోసారి వర్ష సూచన చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు పడతాయని తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంది. మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత
అటు తెలంగాణలో వాతావరణం మళ్లీ వేడెక్కింది. నిన్నటి దాకా కాస్త చల్లగా ఉన్నప్పటికీ.. ఈ ఉదయం నుంచి ఎండ పెరిగిపోయింది. మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ కురిసిన వానలతో పంట నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల వడగళ్ల వానతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షాలు అపార నష్టం మిగిల్చాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Also Read : ఇక జనంలోకి జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం.. యాత్రల పూర్తి వివరాలు

 

ట్రెండింగ్ వార్తలు