Rains In Andhra,Telangana : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

ఉభయ  తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడురోజుల్లో ఓ మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. 

Rains In Andhra,Telangana :  ఉభయ  తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడురోజుల్లో ఓ మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.  ఆగ్నేయ దిశల నుంచి  తెలంగాణలోకి వీస్తున్న శీతలగాలుల ప్రభావం వలన ఈ రోజు  రాష్ట్రంలో  పలు జిల్లాల్లో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదారాబాద్ లోని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయిని చెప్పారు.

మరో వైపు ఆంధ్రప్రదేశ్ లోకి ఈశాన్య, తూర్పుగాలులు వీస్తున్నాయి. వీటి కారణంగా ఉత్తర, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అదే సమయంలో ఒకటి రెండు చోట్లు ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు,ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

దక్షిణ కోస్తా ఆంధ్రా‌లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి,రెండు చోట్ల సంభవించవచ్చని అధికారులు తెలిపారు. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
Also Read : Temple Thieves: పళని దేవాలయానికి చెందిన 400 ఏళ్ల నాటి బంగారు, రాగి సూక్ష్మ ఈటెలు మాయం
ఇక రాయలసీమలో చూస్తే ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉందని అమరావతిలోనివాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.

 

ట్రెండింగ్ వార్తలు