Temple Thieves: పళని దేవాలయానికి చెందిన 400 ఏళ్ల నాటి బంగారు, రాగి సూక్ష్మ ఈటెలు మాయం

400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈటెలు చోరీకి గురికావడంపై నాథం పోలీసులు కేసు నమోదు చేశారు. నాథం పెరుమాళ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు

Temple Thieves: పళని దేవాలయానికి చెందిన 400 ఏళ్ల నాటి బంగారు, రాగి సూక్ష్మ ఈటెలు మాయం

Lord Spears

Temple Thieves: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం పళని అరుల్మిగు దండయుతపాణి స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న నాథం పెరుమాళ్ ఉపదేవాలయంలో చోరీ జరిగింది. 422 ఏళ్లుగా స్వామి వారి ఊరేగింపులో ఉపయోగిస్తున్న బంగారు, రాగి సూక్ష్మ ఈటెలు మాయం అయ్యాయి. 3.5 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ ఈటెలను గత 400 ఏళ్లుగా స్వామి వారి తీర్థయాత్రలో ఉపయోగిస్తారు. కరైకుడి, రామనాథపురం, పుదుక్కోట్టై మరియు శివగంగై ప్రాంతాలకు చెందిన నగరథర్(చెట్టియార్) వంశీకులు పూర్వకాలం నుంచి ఈ తీర్థ యాత్ర చేపడతారు.

Also read: Teachers Issues: 317 జీఓ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల నిరసనలు, అరెస్ట్

కరైకుడి నుంచి పళని దేవాలయం వరకు సాగే ఈ తీర్థయాత్రలో స్వామి వారి ఈటెలు విశిష్టంగా ఉంటాయి. ఈటెలు లేకుండా తీర్థ యాత్ర చేపట్టరాదు. తీర్థయాత్ర అనంతరం నెర్కుప్పాయికి చెందిన కుమారప్పన్ చెట్టియార్ నివాసంలో ఈ ఈటెలను బద్రపరుస్తారు. ఈ ఏడాది జనవరి 13న తీర్థయాత్ర సందర్భంగా ఈటెలను బయటకు తీసిన భక్తులు..కరైకుడి నుంచి పళనికి బయలుదేరారు. యాత్ర నాథంలోని పెరుమాళ్ దేవాలయం వరకు చేరుకోగా ఈటెలను గర్భగుడిలో ఉంచి భక్తులు అక్కడే ఉన్న మండపంలో విశ్రాంతి తీసుకున్నారు. అయితే జనవరి 14న యాత్ర తిరిగి ప్రారంభించే సమయానికి రెండు ఈటెలు కనిపించలేదు. దీంతో యాత్రను ముందుకు సాగించలేని భక్తులు..అప్పటికప్పుడు మరో రెండు ఈటెలను తయారు చేయించి యాత్రను కొనసాగించారు.

Also read: Corona in Police: పోలీస్ శాఖను కలవరపెడుతున్న కరోనా

కాగా 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈటెలు చోరీకి గురికావడంపై నాథం పోలీసులు కేసు నమోదు చేశారు. నాథం పెరుమాళ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కేవలం 1.37 అంగుళాలు మాత్రమే ఉండే ఆ ఈటెలు మాయమవడంపై చెట్టియార్ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read: Hyderabad MMTS: హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లకు నేడూ బ్రేక్