Corona in Police: పోలీస్ శాఖను కలవరపెడుతున్న కరోనా

మూడవ దశలోనూ కరోనా విజృంభిస్తుండడంతో ఇప్పుడు విధులు నిర్వహించాలంటే పోలీసు సిబ్బంది భయపడుతున్నారు.

Corona in Police: పోలీస్ శాఖను కలవరపెడుతున్న కరోనా

Corona

Corona in Police: కరోనా మూడో దశ దేశంలో తీవ్ర ప్రతాపం చూపుతుంది. నిత్యం లక్షలాది కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక తెలంగాణలోనూ కఠిన ఆంక్షల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈక్రమంలో పోలీసులు పటిష్ట భద్రత చేపట్టనున్నారు. మరోవైపు పోలీసుశాఖలోనూ..కరోనా కలకలం రేపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ప్రధాన పోలీస్ స్టేషన్లో సిబ్బంది కోవిడ్ భారిన పడుతున్నారు. దీంతో ఆంక్షల వేళ పోలీసు విధులకు సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉంది.

Also read: Hyderabad MMTS: హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లకు నేడూ బ్రేక్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ దశలో 500 మంది సిబ్బంది కరోనా భారిన పడినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. మొదటి దశ కరోనా సమయంలో 2000 మంది పోలీస్ సిబ్బంది కోవిడ్ భారిన పడగా..50 మంది మహమ్మారికి బలయ్యారు. రెండవ దశలో 700 మందికి కరోనా పాజిటివ్..గా తేలింది. ప్రస్తుతం మూడవ దశలోనూ కరోనా విజృంభిస్తుండడంతో ఇప్పుడు విధులు నిర్వహించాలంటే పోలీసు సిబ్బంది భయపడుతున్నారు. కరోనా సమయంలో పోలీస్ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించిన ప్రభుత్వం.. వారికి వ్యాక్సిన్ లో ప్రాధాన్యత కల్పించింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి పోలీసుశాఖలో 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది.

Also read: Bank Cheating: ప్రైవేట్ బ్యాంకు పేరుతో వందలాది మందికి కుచ్చుటోపీ

ప్రస్తుతం మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్న పోలీస్ అధికారులు..వైద్యశాఖ సూచనల మేరకు సిబ్బందికి వ్యాక్సిన్ పూర్తి చేసి..అవసరమైతే బూస్టర్ డోస్ కూడా వేయించనున్నారు. ఇక కరోనా వ్యాప్తిని నిలువరించేలా పోలీసుశాఖ సాధారణ ప్రజలకు పలు సూచనలు చేసింది. ప్రజలు సమూహాల్లో తిరగరాదని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. పని నిమిత్తం పోలీస్ స్టేషన్ కు వచ్చేవారు ఒంటరిగానే రావాలని, సహాయకులు అవసరమైతే భౌతిక దూరం పాటిస్తూ స్టేషన్ కు చేరుకోవాలని సూచించారు.

Also read: Indian Army: ఇండియన్ ఆర్మీ “యూనిఫామ్” గురించి 5 ఆసక్తికర అంశాలు