Rains In Ap
Weather Forecast : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తమిళనాడు లోని నాగపట్నానికి 320 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ సాయంత్రానికి తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీని ప్రభావం వలన ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read : Devineni Uma : రివర్స్ డ్రామాలాడకుండా ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది-దేవినేని ఉమ
వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు.