Devineni Uma : రివర్స్ డ్రామాలాడకుండా ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది-దేవినేని ఉమ

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వార్థప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ ను తాకట్టు పెడుతున్నారని మాజీ ఇరిగేషన్ శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

Devineni Uma : రివర్స్ డ్రామాలాడకుండా ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది-దేవినేని ఉమ

Devineni Uma maheswara Rao

Devineni Uma :  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వార్థప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ ను తాకట్టు పెడుతున్నారని మాజీ ఇరిగేషన్ శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. 28 మంది ఎంపీలు ఉండికూడా రూ.55,548 కోట్ల కు ఆమోదం తెలిపిన డీపీఆర్ 2 కి సంబంధించి ఆర్ధిక అనుమతులు పొందలేకపోయారని చెప్పారు.

కేంద్ర మంత్రి  పోలవరం పర్యటనలో రూ.47,725కోట్లు ఇస్తే చాలని రాజీపడటంలో పిరికితనం ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులచేత ప్రభుత్వం తమను బాగా చూసుకుందని కేంద్ర జలశక్తి మంత్రికి చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

పునరావసం కింద ఎన్ని ఇళ్లు, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని ఉమా అన్నారు. దాదాపు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని దేవినేని ఉమా ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి  జరిగిన పనులు చెప్పి, కావల్సినవి అడగటంలో విఫలమై తన అసమర్థత నిరూపించు కున్నారని మాజీ మంత్రి అన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పోలవరం పరిశీలనకు వస్తే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అడ్రెస్ లేడని ఉమా ఎద్దేవా చేశారు.
Also Read : NIA Searches : విరసం నేత ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
ముఖ్యమంత్రి రివర్స్ డ్రామా ఆడకుండా ఉండి ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయి ఉండేదని…. బంగారం లాంటి డ్యామ్‌ను ఎత్తిపోతల పథకంగా మార్చి తన తండ్రి విగ్రహం పెట్టుకునేందుకు తప్పుడు పనులు చేస్తున్నారని సీఎంపై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా వివిధ సందర్భాల్లో పోలవరంపై ముఖ్యమంత్రి జగన్  మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు.