NIA Searches : విరసం నేత ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, శ్రీలక్ష్మీ నగర్ లో ఉంటున్న పినాకాపాణి ఇంటికి శనివారం తెల్లవారుఝామున ఎన్ఐఏ అధికారుల

NIA Searches : విరసం నేత ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

NIA Searches

Updated On : March 5, 2022 / 11:02 AM IST

NIA Searches : విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, శ్రీలక్ష్మీ నగర్ లో ఉంటున్న పినాకాపాణి ఇంటికి శనివారం తెల్లవారుఝామున ఎన్ఐఏ అధికారులువచ్చారు.

ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన్ను విచారణ  నిమిత్తం కర్నూలు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ కు రావాలని అధికారులు తెలిపారు.  ఫిబ్రవరిలో కేరళలోని కొచ్చిలో పినాకపాణిపై పై ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేశారు.

గతంలో కూడా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు….ఇంట్లో ఉన్నకొన్నిపుస్తకాలు, పెన్ డ్రైవ్,హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.