Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ మూడు జిల్లాల్లో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు

Weather Updates : ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

Weather Updates

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతుండగా.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. మరోవైపు.. పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. అత్యధిక ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వానలపై వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది.

Also Read : Bullet Train Corridor: అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. తొలి స్టేషన్ ఎక్కడో తెలుసా.. రూట్ మ్యాప్ ఇదే

ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా ఏపీలో మూడు రోజులు వర్షాలు దంచికొట్టనున్నాయి.

అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ కారణంగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

ఇవాళ (గురువారం) ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరిసీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపారు.

రేపు (శుక్రవారం) ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు కాకినాడ, కోనసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం కురుస్తాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతోపాటు ఈదురుగాలుల వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములతో వర్షం, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.