Anandaiah Medicine : కృష్ణపట్నం ఆనందయ్య మందు.. వెబ్‌సైట్‎లో బుక్ చేసుకోండి ఇలా

వచ్చే సోమవారం నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించారు.

Anandaiah Medicine : వచ్చే సోమవారం నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించారు. childeal.in పేరుతో ఈ వెబ్ సైట్ ను శేశ్రిత టెక్నాలజీస్ సంస్థ తయారు చేసింది. మందు కావాల్సిన వాళ్లు వెబ్ సైటు ద్వారా దరఖాస్తు చేసుకుంటే కొరియర్ చేస్తామని నెల్లూరు చెందిన శేశ్రిత టెక్నాలజీస్ సంస్థ వెల్లడించింది.

మందు తయారీ సమయంలో భద్రత తదితర విషయాల్లో సహకరించాలని జిల్లా కలెక్టర్‌కు ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. అలాగే మందు తయారీకి కావలసిన మూలికలు, ఔషధాలు సమకూర్చుకునే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని కోరారు. అవసరమైతే గిరిజన కార్పొరేషన్ సొసైటీ నుంచి తేనే సప్లయ్ చేస్తామని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు హామీ ఇచ్చారు.

కంట్లో వేసే మందుకి తప్పిస్తే ఆనందయ్య తయారు చేసిన ఇతర మందుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కంట్లో వేసే మందుకి తప్ప మిగతా వాటికి అనుమతి లభించింది. కేంద్ర ఆయుష్ విభాగం నివేదిక ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదిక రాలేదు. అందుకు మరో మూడు వారాలు పట్టే చాన్సుంది. ఆనందయ్య ఇతర మందుల్లో హానికర పదార్దాలు లేవని నివేదికలు తేల్చాయి. అదే సమయంలో ఆనందయ్య మందుతో కరోనా తగ్గుతుందని నిర్ధారణ కాలేదని వెల్లడించారు. డాక్టర్లు ఇచ్చిన మందులతో పాటు ఆనందయ్య మందులు వాడాలని ప్రభుత్వం సూచించింది.

ట్రెండింగ్ వార్తలు